భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మీ పేరుతో ఉన్న సిమ్ సైబర్ మోసాలకు ఆయుధంగా మారుతోందా…? DoT కీలక హెచ్చరిక
సిమ్ దుర్వినియోగం చేస్తే 3 ఏళ్ల జైలు + ₹50 లక్షల వరకు జరిమానా!
ఛత్తీస్‌గఢ్‌లో ప్రజలకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా ఓ PoS ఏజెంట్ 25 సిమ్‌లను యాక్టివేట్ చేశాడు.
@DoT_India, టెలికాం కంపెనీలు సదరు PoS ఏజెంట్‌ను బ్లాక్‌లిస్ట్ చేశాయి.
అనుమానాస్పద నంబర్లను Digital Intelligence Platformలో తనిఖీ చేసి, రీ-వెరిఫికేషన్‌లో విఫలమైన నంబర్లను డీయాక్టివేట్ చేశారు.
మీ పేరుతో ఉన్న సిమ్‌ను ఇతరులకు ఇవ్వడం, అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చు.
ఆ సిమ్‌ను సైబర్ మోసాలకు ఉపయోగిస్తే అసలు సబ్‌స్క్రైబర్‌పైనా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
నకిలీ డాక్యుమెంట్లు, మోసం లేదా ఇతరుల పేరుతో సిమ్ పొందడం కూడా నేరమే.
TAMPERED IMEI ఉన్న మొబైల్స్/డివైజ్‌లు, SIM Boxes విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి.
IMEI, CLI లేదా ఇతర టెలికాం ఐడెంటిఫైయర్లను ట్యాంపరింగ్ చేసినా చర్యలు తప్పవు.
Sanchar Saathiలో మీ పేరుతో ఎన్ని మొబైల్ నంబర్లు యాక్టివ్‌గా ఉన్నాయో ఇప్పుడే చెక్ చేసుకోండి!
గుర్తు తెలియని నంబర్లు కనిపిస్తే వెంటనే BLOCK/REPORT చేయండి.
Sanchar Saathiలోని ‘Check Genuineness of Your Mobile Handset’ ఫీచర్‌తో మీ మొబైల్ IMEIని కూడా VERIFY చేసుకోవచ్చు.