జిల్లా పరిషత్, మండల పరిషత్తుల్లో ఒకరే వైస్ ఛైర్మన్, ఉపాధ్యక్షులు ఉండేలా చేసిన చట్ట సవరణ

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్తుల్లో ఒకరే వైస్ ఛైర్మన్, ఉపాధ్యక్షులు ఉండేలా చేసిన చట్ట సవరణ ఈ నెల 25 నుంచి అమలులోకి వస్తోందని ఏపీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీలో ఇద్దరు వైస్ ఛైర్మన్లు, మండల పరిషత్లో ఇద్దరు ఉపాధ్యక్షుల పదవులను ఒకటికి తగ్గిస్తూ చేసిన చట్ట సవరణ బిల్లును శాసనసభ ఇటీవల ఆమోదించింది.