భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళంకోడూరు మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలి
సెప్టెంబర్ 23న తాసిల్దార్ గారికి అర్జీలు సమర్పణ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
ఎలినినో ప్రభావం వలన వర్షాభావంతో కోడూరు మండలంలో వరి నాట్లు పడక రైతాంగం, ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే కోడూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 23న తాసిల్దార్ కార్యాలయంలో అర్జీలు సమర్పణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కోడూరు ప్రధాన సెంటర్లో సోమవారం కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు ఆవుల బసవయ్య మాట్లాడుతూ కోడూరు మండల వ్యాప్తంగా ఉన్న చెరువులను మంచినీటితో నింపాలని ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టాలని, ప్రతి రైతు కుటుంబానికి 20వేల రూపాయలు కరువు సహాయం అందించాలని,
సాగు చేస్తున్న రైతులకు కౌలు రైతులకు డీజిల్ సబ్సిడీపై అందించాలని, ప్రభుత్వమే క్రాప్ ఇన్సూరెన్స్ చేయించాలని, సాగు చేయని పొలాలకు వాతావరణ సంబంధించిన ఇన్సూరెన్స్ చేయించి రైతులను ఆదుకోవాలని, కౌలు దారుల పేర్లు నమోదు చేసి పంట నష్టపరిహారం కౌలుదారులకే అందించాలని కూలీలకు నెలకు పదివేల కరువు భత్యం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పోలాబత్తిన మోహన్రావు, ప్రజా సంఘాల నాయకులు రేపల్లె యోగ ప్రకాష్, బత్తిన రాజగోపాల్, చెక్క వెంకటేశ్వర్రావు, బాలగోపాల రామకృష్ణారాజు, విస్సంశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.