భారత్ డిజిటల్ న్యూస్:న్యూఢిల్లీ:
కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో భారత పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) 78వ రెగ్యులర్ రిక్రూట్ బ్యాచ్ ట్రైనీ అధికారులతో సమావేశమై వారితో ముచ్చటించారు.
పౌరుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే నిపుణులుగా, అంతర్గత భద్రతకు ఎదురయ్యే సవాళ్లను తిప్పికొట్టేవారిగా వారి వృత్తి జీవితానికి ఈ క్షణం శ్రీకారం చుడుతుందని ఆయన పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల రవాణా, సైబర్ నేరాలు, విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదం వంటి ముప్పుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ యువ అధికారుల నైపుణ్యం, అంకితభావం, నిబద్ధత భారతదేశ ప్రగతి ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తాయని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.