శ్రీ శివ సహస్రనామ స్తోత్రం

భారత్ డిజిటల్ న్యూస్ భక్తిశ్రీ శివ సహస్రనామ స్తోత్రం ॥
🦚🌹🦢🙏🦢🌹🦚
విశ్వక్షేత్రం ప్రజాబీజం
లింగమాద్యస్తు నిర్గమః।
సదసద్వ్యక్త మవ్యక్తం
పితా మాతా పితామహః॥

శ్లోకార్థం:

విశ్వక్షేత్రం
విశ్వమే క్షేత్రం, విశ్వమే శరీరం!

ప్రజాబీజం
ప్రజలకు బీజం, సృష్టికి విత్తనం!

లింగమాద్యస్తు
లింగ రూపంలో మొదటివాడు!

నిర్గమః
బయటకు వెళ్ళేవాడు,
మోక్షాన్ని ఇచ్చేవాడు!

సదసద్వ్యక్త మవ్యక్తం
ఉన్నదీ, లేనిదీ, కనిపించేదీ, కనిపించనిదీ అన్నీ తానే!

పితా మాతా పితామహః
తండ్రి, తల్లి, తాత – అన్నీ తానే!

శ్లోక భావార్థం:

ఈ శ్లోకం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే,
శివుడే అమ్మా, నాన్నా
రెండూ, ఒకే రూపంలో కలవాడు!
అదే అర్ధనారీశ్వర తత్వం!

విశ్వక్షేత్రం అంటే – విశ్వమే క్షేత్రం!
క్షేత్రం అంటే పొలం!
విశ్వం అంతా శివుడి పొలం!
ఆ పొలంలో అందరూ పంటలే
ఆడవారు, మగవారు, అన్ని కులాల వారు
అందరూ ఒకే పొలంలో పంటలు!

ప్రజాబీజం అంటే – ప్రజలకు బీజం!
బీజం అంటే విత్తనం!
శివుడు అందరికీ విత్తనం!
ఆ విత్తనం నుండి అందరూ పుట్టారు!
అందరూ ఒకే విత్తనం నుండి పుడితే ?
ఎవరు గొప్ప?
ఎవరు తక్కువ?
అందరూ సమానమే!

లింగమాద్యస్తు – నిర్గమః అంటే – మొదటివాడు, మోక్షం ఇచ్చేవాడు!
లింగం అంటే గుర్తు!
శివలింగం అంటే శివుడి గుర్తు!
ఆ గుర్తు మొదటిది – ఆద్యః!
నిర్గమః అంటే బయటకు వెళ్ళేవాడు
సంసారం నుండి బయటకు తీసుకెళ్ళి మోక్షం ఇచ్చేవాడు!

సదసద్వ్యక్త మవ్యక్తం అంటే – ఉన్నదీ, లేనిదీ అన్నీ శివుడే!
సత్ అంటే ఉన్నది –
అసత్ అంటే లేనిది!
వ్యక్తం అంటే కనిపించేది
అవ్యక్తం అంటే కనిపించనిది!
శివుడు కనిపించే వారిలోనూ ఉన్నాడు, కనిపించని వారిలోనూ ఉన్నాడు!

పితా మాతా పితామహః అంటే – తండ్రి, తల్లి, తాత!
శివుడు కేవలం తండ్రి కాదు!
శివుడు తల్లి కూడా!
శివుడు తాత కూడా!
ఎందుకంటే ?
శివుడు “అర్ధనారీశ్వరుడు”
సగం శివుడు, సగం పార్వతి!
శివుడు ఒక్కడే ఉంటే సగమే!
పార్వతి లేకపోతే శివుడు శవం అయిపోతాడు
అదే మన పెద్దలు చెప్పారు
మనలో శివ శక్తులు లేకపోతే శవంతో సమానమే!

ఈరోజు సోమవారం:

ఓం పిత్రే నమః
ఓం మాత్రే నమః
ఓం పితామహాయ నమః
అని 21 సార్లు జపించండి.
శివానుగ్రహానికి పాత్రులుకండి!

🪷మిత్రులకు,ఇందువాసర శుభోదయం.🪷