భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ద్రాస్ సెక్టార్‌ను కప్పేసిన మంచు దుప్పటి.. కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు ..
శీతాకాలం ఆరంభం కావడంతో హిమాలయ ప్రాంతాల్లో మంచు కురవడం మొదలైంది. ఆదివారం లఢఖ్‌లోని ద్రాస్ సెక్టార్ మంచు దుప్పటిలా కప్పేసింది. రోడ్లు, ఇళ్లు, వాహనాలు మంచులో కూరుకుపోయాయి. మంచుతో నిండిన కొండలు వెండి కొండల వలె మెరుస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.

స్థానికులకు ఇది సాధారణ విషయమే అయినప్పటికీ, ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఈ మంచు అందాలను చూసి ఆనందంలో మునిగిపోతున్నారు. ఈ ప్రాంతం మొత్తం తెల్లని వస్త్రం పరిచినట్లుగా దర్శనమిస్తోంది….