భారత్ డిజిటల్ న్యూస్ భక్తి..శ్రీ మేధా దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం ॥
🦚🦢🌻🙏🌻🦢🦚
జటాకోటీ రఘటిత
సుధాకర సుధాప్లుతః।
పశ్యల్లలాట సుభగ
సుందర భ్రూ విలాసవాన్॥
శ్లోకార్ధం:
జటాకోటీ రఘటిత
కోటి జటలు కలవాడు,
ఆ జటలలోనే చంద్రుడు చిక్కుకొని ఉన్నాడు!
సుధాకర సుధాప్లుతః
చంద్రుడి అమృతంలో మునిగినవాడు!
పశ్యల్లలాట సుభగ
చూస్తున్న నుదుటి మీద శుభం కలవాడు!
ఆయన నుదుటిని దర్శించిన వాళ్లకు శుభాన్ని అనుగ్రహించేవాడు!
సుందర భ్రూ విలాసవాన్
అందమైన కనుబొమ్మల విలాసం కలవాడు!
శ్లోక భావార్థం:

జటా – జటలు అంటే ఏమిటి?
జటలు అంటే చిక్కుబడ్డ జుట్టు!
మన ఆలోచనలు గందరగోళంగా చిక్కుబడినట్టు!
దక్షిణామూర్తి జటలలో చంద్రుడు ఉన్నాడు!
సుధాకర సుధాప్లుతః
చంద్రుడి అమృతం!
చంద్రుడు అంటే చల్లదనం, ప్రశాంతత!
జటలు అంటే వేడి, చిక్కు!
చంద్రుడి అమృతం జటల మీద పడితే
చిక్కు విడిపోతుంది!
వేడి చల్లబడుతుంది!
మనసుకు ప్రశాంతత లభిస్తుంది!
లలాట సుభగ – నుదురు శుభం అంటే !
నుదురు అంటే జ్ఞానం ఉండే చోటు
ఆజ్ఞా చక్రం!
దక్షిణామూర్తి నుదురు చూస్తేనే శుభం కలుగుతుంది!
సుందర భ్రూ విలాసవాన్ – అంటే అందమైన కనుబొమ్మలు!
కనుబొమ్మలు అంటే చూపు!
దక్షిణామూర్తి కనుబొమ్మలు అందంగా ఉంటాయి
ఎందుకంటే ఆయన అందరినీ సమానంగా చూస్తాడు!
ఆనందాన్ని అనుగ్రహిస్తాడు!
ఈరోజు గురువారం:
ఓం సుధాప్లుతాయ నమః
ఓం లలాట సుభగాయ నమః
అని 21 సార్లు జపించండి.
శ్రీ గురు మేధా దక్షిణామూర్తి అనుగ్రహానికి పాత్రులుకండి!
🪷మిత్రులకు,బృహస్పతి వాసర శుభోదయం.🪷