కీచక వైస్‌ చాన్సలర్ అల్దాస్ జానయ్యపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని బాధిత మహిళా ప్రొఫెసర్ ఆవేదన

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కీచక వైస్‌ చాన్సలర్ అల్దాస్ జానయ్యపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని బాధిత మహిళా ప్రొఫెసర్ ఆవేదన

అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్ అల్దాస్ జానయ్యపై ఫిర్యాదు చేయడానికి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీ

అయితే ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వడానికి నిరాకరించారని, ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించిన తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు

ధర్నాలో పాల్గొన్న విద్యార్థులను హాస్టల్‌ నుంచి బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి విద్యార్థులు

విషయం తెలుసుకొని తేజశ్రీకి మద్దతుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తమను అక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేదంటే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన TASA అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు

పోలీసులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ వైస్‌ చాన్సలర్ అల్దాస్ జానయ్యకు అండగా నిలుస్తున్నారని, వారి వ్యవహారశైలిపై ఉన్నతాధికారులు స్పందించాలని విద్యార్థుల డిమాండ్…