శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం ॥

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి..శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం ॥
🦚🦢🌹🙏🌹🦢🦚
షడ్వర్గదాతా షడ్రీవః
షడరిఘ్నః షడాశ్రయః।
షట్కిరీట ధరః శ్రీమాన్
షడాధారశ్చ షట్రమః॥

శ్లోకార్థం:

షడ్వర్గదాతా
ఆరు వర్గాలను ఇచ్చేవాడు
ధర్మ, అర్థ, కామ, మోక్ష, జ్ఞాన, వైరాగ్యం!

షడ్రీవః
ఆరు ముఖాలు కలవాడు
అన్నీ లోకాలను రక్షించేవాడు షణ్ముఖుడు!

షడరిఘ్నః
ఆరు శత్రువులను నాశనం చేసేవాడు
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం!

షడాశ్రయః
మనలో ఉన్న ఆరు చక్రాలైన, మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, ఈ ఆరు చక్రాలకు ఆశ్రయం ఇచ్చేవాడు!
యోగాభ్యాస, ధ్యానం, ప్రాణాయామం, నిత్య సాధన ద్వారా మనం
“సహస్రారాన్నీ” చేరుకోవచ్చు!

షట్కిరీట ధరః శ్రీమాన్
ఆరు కిరీటాలు ధరించినవాడు!
ఐశ్వర్యం కలవాడు
ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు!

షడాధారశ్చ
ఆరు ఆధారాలకు ఆధారం అయినవాడు!
మనలో ఉన్న ఆరు చక్రాలకు, శక్తిస్వరూపంలో ఉన్నవాడు!

షట్రమః
ఆరు విధాలుగా రమించేవాడు
ఆరు విధాలుగా ఆనందించేవాడు!
ఆరు ఆనందాలన్ని ప్రసాదించేవాడు!

ఈరోజు మంగళవారం:
ఓం షడరిఘ్నాయ నమః
ఓం షడ్వర్గదాత్రే నమః
అని 21 సార్లు జపించండి.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం పాత్రులుకండి!

🪷మిత్రులకు,భౌమవాసర శుభోదయం.🪷