జింబాబ్వేలో హెలికాప్ట‌ర్ కూలి ఏడుగురు మృతి….

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..జింబాబ్వేలో హెలికాప్ట‌ర్ కూలి ఏడుగురు మృతి….

జింబాబ్వేలోని మారోండెరా గ్రామీణ ప్రాంతంలో బుధవారం ఒక హెలికాప్టర్ కూలిపోవడంతో ఏడుగురు మరణించారు. మృతులలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త, నలుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు.

ప్రభుత్వ ప్రతినిధి నిక్ మంగ్వానా ఈ విషయాన్ని ధృవీకరించారు. అత్యవసర సేవల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….