తెలంగాణలో మళ్లీ వర్షాలు!

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..తెలంగాణలో మళ్లీ వర్షాలు!

తెలంగాణలో గత రెండు రోజులుగా తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలో అత్యధికంగా 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, పలు ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి.

ఇదిలా ఉండగా తెలంగాణ కి మళ్లీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అక్టోబర్ 4, 5 తేదీల్లో పలు జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది….