శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ కావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్‌ వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు.

శంషాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరిన 591 ఎయిర్‌లైన్స్‌ విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను గుర్తించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని తిరిగి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించారు.

అనంతరం విమానం ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేసింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యపై అధికారులు సమాచారం వెల్లడించాల్సి ఉంది.