మళ్లీ పెరగనున్న సిమెంట్ ధరలు

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..మళ్లీ పెరగనున్న సిమెంట్ ధరలు

సిమెంట్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్ బ్రోకింగ్ వెల్లడించింది. అక్టోబర్లో ఒక్కో బ్యాగ్పై రూ.5 నుంచి రూ.20 వరకు కంపెనీలు పెంచవచ్చని అంచనా వేసింది. ఇటీవల ఇంధన ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. అయితే, మార్కెట్ డిమాండ్, డీలర్ల ఆమోదంపై ఈ ధరల పెంపు ఆధారపడి ఉంటుందని నివేదిక పేర్కొంది.

గత సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా ఒక్కో బ్యాగ్పై సగటున రూ.7 పెరిగిన సంగతి తెలిసిందే.