భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ కన్నుమూత
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ (77) కన్నుమూశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పదిరోజులుగా చికిత్స పొందుతున్న ఆయన, చికిత్స ఫలించక మరణించినట్లు ట్రస్టు ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన పార్థివదేహాన్ని తిరుపతిలోని ఏకం ఆలయంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి సందర్శనకు ఉంచనున్నారని, శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
