విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

విశాఖపట్నం :

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో మొత్తం 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో 42 స్టేషన్లతో ప్రాజెక్టు చేపట్టనున్నారు. సుమారు రూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం జరగనుంది.

కూర్మన్నపాలెం-కొమ్మాది, గురుద్వారా-పాత పోస్టాఫీసు, తాటిచెట్లపాలెం-చినవాల్తేరు మార్గాల్లో మెట్రో ట్రైన్ నడవనుంది. భవిష్యత్తులో భోగాపురం విమానాశ్రయం వరకు విస్తరించే అవకాశం ఉంది.