భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్
ప్రగడవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) సర్వసభ్య సమావేశం
ఏలూరు జిల్లా,చింతలపూడి మండలం, ప్రగడవరం:
రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు.
చింతలపూడి మండలం ప్రగడవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ) ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య (జనరల్ బాడీ) సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సహకార సంఘాలు రైతులకు వెన్నెముక వంటివని, గ్రామాల్లోని ప్రతి రైతుకూ ప్రభుత్వ పథకాలు, రాయితీలు చేరేలా సొసైటీలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లను కొరత లేకుండా సకాలంలో అందుబాటులో ఉంచాలని అధికారులను, పాలకవర్గాన్ని ఆదేశించారు.

అలాగే అర్హులైన రైతులందరికీ రుణాలు మంజూరు చేసి, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ స్థాయిలో ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో సొసైటీ అభివృద్ధి ప్రణాళికలు, వార్షిక ఆదాయ-వ్యయాల నివేదికలు, రైతులకు అందించాల్సిన సేవలపై సమగ్రంగా చర్చించారు. రైతులు తమ పంటలకు సంబంధించి ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ముత్తా రెడ్డి , సొసైటీ అధ్యక్షులు తాళ్లూరి చిన్నా బాబు ,డైరెక్టర్లు, సహకార శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ రైతులు పాల్గొన్నారు.