భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళంనిధుల అక్రమాలపై ఐటీ దాడులు.. 12 ప్రాంతాల్లో సోదాలు
ముంబై: నిధుల అక్రమ లావాదేవీలపై అనుమానాలతో ముంబై ఆదాయపు పన్ను శాఖ అధికారులు 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సినిమా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుతున్నామనే పేరుతో డబ్బులను విదేశాలకు తరలిస్తున్నారనే అనుమానంతో అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

ఈ సోదాల్లో భాగంగా పలు బృందాలు పత్రాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, విదేశాలకు జరిగినట్లు అనుమానిస్తున్న నగదు బదిలీల వివరాలను పరిశీలిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. గత ఏడాది డిసెంబర్లో నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ కేసులో తెరపైకి వచ్చింది. 2025 డిసెంబర్ 19న ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (EAGLE) ఫోర్స్, వెస్ట్ జోన్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు వ్యాపారులను డ్రగ్స్ విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు.
వారి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరు డ్రగ్ పెడ్లర్ల నుంచి అమన్ ఐదుసార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.