నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో నిషేధిత జాబితా(సెక్షన్ 22ఏ)లో ఉన్న ఇళ్లు, ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతినిచ్చింది. గురువారం రాత్రి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేశ్‌కుమార్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. GHMC, HMDA, DTCP అనుమతులు పొందిన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు తొలగిపోయాయి. రంగారెడ్డిలో 44, మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 65, రాష్ట్రవ్యాప్తంగా 264 కాలనీల్లో ఆస్తుల విక్రయాలకు స్వేచ్ఛ లభించింది. అయితే, కోర్టు స్టే ఉన్న ఆస్తులకు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తారు. సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.