ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 2 డీఏల విడుదలకు ప్రభుత్వం సిద్ధం?…

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 2 డీఏల విడుదలకు ప్రభుత్వం సిద్ధం?…

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండింటిని త్వరలో విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

మిగిలిన డీఏలను పీఆర్సీలో కలిపి ఇవ్వడంతో పాటు ఒకటి, రెండు నెలల్లో పీఆర్సీ అమలు దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.10 వేల కోట్లకు పైగా బకాయిల చెల్లింపుల కోసం ప్రస్తుతం నెలకు కేటాయిస్తున్న రూ.1,000 కోట్లను రూ.2,000 కోట్లకు పెంచాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

కాగా, పీఆర్సీ, డీఏలు, సీపీఎస్‌ రద్దుపై బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉద్యోగ సంఘాల సమావేశం జరగనుంది….