పౌరసరఫరాల శాఖలోని రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం..పౌరసరఫరాల శాఖలోని రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా 12 మందిని నామినేట్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

పౌరసరఫరాల శాఖ మంత్రి అధ్యక్షతన అధికారిక, అనధికారిక సభ్యులతో రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీని ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసింది. అందులో

తాజాగా అనధికారిక సభ్యులు (ప్రత్యేక ఆహ్వానితులు) గా వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల నుంచి మర్రి సత్యనారాయణ (విశాఖపట్నం), కొమ్మూరి శ్రీనివాసరావు (కాకినాడ), జి.అనంతరావు(తూర్పుగోదావరి జిల్లా), బొబ్బిలి బంగారయ్య (పశ్చిమగోదావరి జిల్లా), తరుణ్ కాకాణి (ఎన్టీఆర్ జిల్లా), చదలవాడ హరిబాబు (గుంటూరు జిల్లా), షేక్ మస్తాన్ (పల్నాడు జిల్లా), డి.ఇమ్మాన్యుయేల్ (బాపట్ల జిల్లా), పి.రాజారెడ్డి (తిరుపతి జిల్లా), ఎం.వెంకటరెడ్డి (అన్నమయ్య జిల్లా), సీపీ రమేశ్ (వైఎస్సార్ కడప జిల్లా), గఫార్ (శ్రీసత్యసాయి జిల్లా)లను నామినేట్ చేసింది.