ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్.. నేడే లాస్ట్

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్.. నేడే లాస్ట్

అమరావతి :

ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువలు గడువు సోమవారంతో ముగియనుంది. రాష్ట్రంలో 3,650 షాపుల లైసెన్సుల రెన్యువల్ లు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నిన్న (ఆదివారం) సాయంత్రం 6 గంటల వరకు 2,993 మంది (82%) దరఖాస్తు చేసుకున్నారు. కొందరు పూర్తి, మరికొందరు పాక్షికంగా రుసుము చెల్లించగా.. ప్రభుత్వానికి రూ.770.3 కోట్ల ఆదాయం సమకూరింది. ఇంకా 657 షాపులకు దరఖాస్తులు రావాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు టైమ్ ఉంది కాబట్టి ఇంకా ఎన్ని షాపులు రెన్యూవల్ చేసుకుంటాయో తెలియాల్సిఉంది. అలాగే ప్రభుత్వం కూడా మరికొంత సమయం ఇస్తుందో.. లేదో చూడాలి..